నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు

© File Photo

నేడు (ఆగస్టు 9న) దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మొహర్రం పండుగ సందర్భంగా BSE & NSEలో అన్ని ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవని తెలిపారు. కానీ కమోడిటీ మార్కెట్‌లు మంగళవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 11:30 వరకు సెషన్‌ జరుగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో నేషనల్ కమోడిటీ & డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (NCDEX)లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలు జరగనున్నాయి.

Exit mobile version