విండీస్ తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా ఈ రోజు నాలుగో సమరానికి సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ లో 2-1తో భారత జట్టు ఆధిక్యంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్ ఫ్లోరిడాలో జరగనుంది. ఇక్కడ ఇప్పటికి 3 సార్లు 200కు దాటి పరుగులు నమోదయ్యాయి. అయితే ఛేదనలో జట్లు ఇబ్బందిపడ్డాయి. టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. వెస్టిండీస్ సిరీస్ లెవెల్ చేసేందుకు పోరాడుతుండగా…. భారత జట్టు నేటి మ్యాచ్ గెలిచి కప్పు కొట్టేయ్యాలని భావిస్తోంది.