రాష్ట్రంలో భాజపా కార్యవర్గ సమావేశాలకు కీలక నాయకుల రాక మొదలైంది. 340 మంది ప్రతినిధులకు గానూ 200 మంది హైదరాబాద్ వచ్చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ సాయంత్రం నగరానికి చేరుకుంటారు. 2న ఉ.10 గం.లకు జాతీయ పదాధికారుల సమావేశం ఉంటుంది. సాయంత్రం జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2.30-3.00 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. 3న ఉదయం 10గంటల నుంచి 4 గంటల వరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. 3న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు సాయంత్రం 6 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఏడున్నర వరకు ఉంటారు. 4న ఉదయం విజయవాడకు వెళ్తారు.
నేడు కమళ దళపతి..రేపు ప్రధాని మోదీ

© ANI Photo