అగ్నిపథ్, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ధరలు పెంచి ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని ప్రతి ఒక్కరూ నిరసనలో పాల్గొనాలని కోరింది. ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టం చేసింది. అగ్నిపథ్ కూడా వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలోనూ ఆందోళనలు చేపట్టేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.