TS: నేడు బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ సందర్శించనున్నారు. మంత్రి సబితతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం కేటీఆర్‌తో రానున్నారు. మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్ రావాలని గతంలో విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
నేడు బాసరకు మంత్రి కేటీఆర్

Courtesy Twitter: KTR TRS