నేడు పలు జిల్లాల్లో కుంభవృష్టి ముప్పు

tsdps

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. శనివారం నాడు అతి భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నెల 7 నుంచి 9 మధ్య అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. 7న 12 సెం.మీ. నుంచి 20 సెం.మీ. మేర భారీ వర్షాలు కురుస్తాయని, 8, 9 తేదీల్లో 20 సెం.మీ. పైగా వానలు కురుస్తాయని తెలిపారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కుంభవృష్టి ఉంటుందని అంచనా వేశారు. విపత్తు నిర్వహణ బృందాలకు ఇప్పటికే సమాచారం అందించామని పేర్కొన్నారు

Exit mobile version