కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు, రేపు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం వెల్లడించింది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. ఈ సమ్మెతో పాక్షికంగా బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య తెలిపింది. అలాగే ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని టీఆర్ఎస్ ప్రకటించింది. దాదాపు అన్ని శాఖల ఉద్యోగులు ఈ భారత్ బంద్‌లో పాల్గొంటున్నాయి.