సాయిపల్లవి, రానా ప్రధాన పాత్రల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన చిత్రం ‘విరాట పర్వం’. జూన్ 17 న థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రానికి సంబంధించి ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ శిల్పకళావేదికలో వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వెంకటేశ్, రామ్ చరణ్, సుకుమార్ కార్యక్రమానికి అతిథులుగా వస్తున్నారు. విప్లవం, ప్రేమ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.