– తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీల బాదుడు. రూ.5 నుంచి రూ.170 వరకు పెంపు.
– జుబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసుల కస్టడీకి నిందితుడు సాదుద్దీన్. ఎమ్మెల్యే కుమారుడు సహా మైనర్లను జువెనైల్ హోంకు తరలింపు
– రాజధాని అమరావతిలో 3 నెలల్లో ఫ్లాట్లు కేటాయించలేమన్నఏపీ ప్రభుత్వం. గడువును ఐదేళ్లకు పెంచాలని హైకోర్టుకు వినతి
– ఆహార భద్రత సూచీలో తెలంగాణ 15, బిహార్ 16, ఆంధ్రప్రదేశ్ 17 స్థానాలు
– నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీకి 3 వారాల గడువు కోరిన సోనియా గాంధీ
– మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో బావిలో విషవాయువు లీకై ఐదుగురు దుర్మరణం
– గుజరాత్ లో 3,400 ఇంటర్ విద్యార్హత పోస్టులకు 18 లక్షల దరఖాస్తులు. దేశంలో నిరుద్యోగానికి అద్దం పడుతోందని విపక్షాల విమర్శలు
– ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 129 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బంగాల్ జట్టు. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో జట్టులోని 9 మంది బ్యాటర్లు అర్దశతకాలు చేసి రికార్డు.
– నేడే సౌతాఫ్రికాతో టీమిండియా తొలి టీ20. దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా 7గం.లకు మ్యాచ్