సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి యువతిని మోసం చేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఓ యువతి కొన్నేళ్లుగా ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతుకుతుంది. సామాజిక మాధ్యమాల్లోనూ జాబ్ ఆఫర్లను చూసింది. ఇన్స్టాలో ఓ ప్రకటను చూసి మేసేజ్ చేయటంతో మోసగాళ్లు గ్లోబల్ సిస్టమ్ పేరుతో పరిచయం చేసుకున్నారు. మంచి ప్యాకేజీ ఇప్పిస్తామని నమ్మించారు. రూ. 7 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో ఆమె విడతలవారీగా పంపించింది. తర్వాత స్పందించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.