టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను ఎక్సైజ్ శాఖ ఈడీకి సమర్పించింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. కాల్ రికార్డ్స్, ఆడియో, వీడియో ఫైల్స్ పరిశీలిస్తున్నట్లు తెలిపింది. డ్రగ్స్ లావాదావీలు, మనీ ల్యాండరింగ్ వంటి విషయాలపై ఫోకస్ చేసింది. ఈ కేసులో సరైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్ శాఖ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పూరీ జగన్నాథ్, చార్మీ, రవితేజ, ముమైత్ ఖాన్, నవదీప్, తనీష్ వంటివాళ్లు ఉన్నారు. కానీ తమ చేతికి ఆధారాలు రావడంతో ఈడీ మరోసారి వారిని విచారించనుంది.