టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రేఖ భోజ్ పలు సంచలన విషయాలను చెప్పింది. తాను నటన మీద మమకారంతో డిగ్రీ చదివే రోజుల్లోనే సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేశానని తెలిపింది. పలు షార్ట్ ఫిలింస్ లో కూడా నటించానని చెప్పింది. నువ్ కమిట్మెంట్ ఇచ్చినా కానీ హీరోయిన్ కాలేవని తనతో చాలా మంది అన్నారని బాధపడింది. కానీ నటన మీద ఉన్న ప్రేమతో వాటిని లైట్ తీసుకున్నానని తెలిపింది. సైడ్ క్యారెక్టర్స్ చేసుకోవాలని తనకు చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చారని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం రేఖ భోజ్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. హీరోయిన్ గా ఈ అమ్మడు నటించిన దామిని విల్లా చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.