టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం

© File Photo

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. చలనచిత్ర రంగ వాణిజ్య మండలి అధ్యక్షుడు, ప్రముఖ ప్రొడ్యూసర్ నారాయణ దాస్ నారంగ్ (78) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన స్టార్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు క‌న్నుమూశారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరికి ఏషియన్ థియేటర్స్ కూడా ఉన్నాయి. మరోవైపు హీరో నాగార్జునతో ఘోస్ట్, ధనుష్ తో మరో సినిమాను కూడా చేస్తున్నారు.

Exit mobile version