టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న అతను హైదరాబాద్ లోని వెంగళ్ రావు నగర్లో తన నివాసంలో మృతి చెందారు. యాదగిరి మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ సారథ్యంలో అనేక పాటలు రాశారు. పోకిరి, స్టాలిన్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, సత్యం సహా పలు చిత్రాలకు సాంగ్స్ రాశారు. కందికొండ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.