నేటి నుంచి షూటింగ్స్ స్టార్ట్

గ‌త కొన్ని రోజులుగా సినిమాల షూటింగ్స్ నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చలు ఒక కొలిక్కి రావ‌డంతో సెప్టెంబ‌ర్ 1 నుంచి చిత్రీక‌ర‌ణ‌లు ప్రారంభించ‌వ‌చ్చ‌ని చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి తెలిపింది. అత్య‌వ‌స‌ర‌మైతే ఆగ‌స్ట్ 25 నుంచే స్టార్ట్ చేయ‌వ‌చ్చ‌ని పేర్కొంది. దీంతో ఇన్నిరోజులు ఆగిపోయిన సినిమాల‌న్నీ నేటి నుంచి మ‌ళ్లీ షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్నాయి. నేడు బాల‌కృష్ణ‌, గోపిచంద్ మ‌లినేని మూవీ..నాని ద‌స‌రా మూవీ షూటింగ్స్ తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. కొన్ని కొత్త సినిమాలు ముహుర్తాలు అవుతున్నాయి. బుధ‌వారం ఇండ‌స్ట్రీలో బ‌డా డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు ఫిల్మ్‌చాంబ‌ర్‌లో స‌మావేశ‌మ‌య్యారు. నిర్మాణ వ్య‌యం త‌గ్గించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకునేలా చ‌ర్చ‌లు జ‌రిపారు.

Exit mobile version