కేరళలో టమెటా ఫీవర్ 80 మందికి పైగా పిల్లలకు వ్యాపించింది. దీంతో ఆయా పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో జ్వరం, దద్దుర్లు అనారోగ్యా లక్షణాలు ఉన్నవారిపై పరీక్షలు చేస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాల్లో ప్రాథమికంగా తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్, దద్దుర్లు, చర్మం దురద, చేతులు, కాళ్ల చర్మం రంగు మారడం, అలసట వంటివి ఉన్నట్లు తెలిపారు.