టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్రోల్లో నటిస్తున్న శాకుంతలం చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. చిత్రంలోని మల్లిక అంటూ సాగే పాటను రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పాటకు మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో విడులవుతుంది. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.