ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు హైదరాబాద్ రానున్నారు. రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్స్ కి ఉపరాష్ట్రపతి రానున్న తరుణంలో పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఉదయం 6 నుంచి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. తిరుమలగిరి, బోయిన్‌పల్లి, టివోలి క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, బేగంపేట్, ప్యారడైజ్, జేబీఎస్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు మళ్లింపులు ఉంటాయని రంగనాథ్ స్పష్టం చేశారు.