2024 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా టీమిండియా పూర్తిగా నూతన జట్టుతో శ్రీలంక సిరీస్కు బరిలోకి దిగుతోంది. హార్ధిక్ పాండ్యా సారథ్యంలో జట్టుకు యువరక్తం ఎక్కించారు. ఈ క్రమంలో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరిద్దరికీ ఓపెనర్లుగా ఆడిన అనుభవం జట్టుకు కలిసొస్తుంది. ఇక సూర్య, త్రిపాఠి/సంజు శాంసన్ 3, 4 స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది. ఆల్రౌండర్లు దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా జట్టుకు సమతూకం తీసుకురానున్నారు. ఆరుగురు బౌలర్లతో జట్టు కూర్పు ఉండనుంది. చాహల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నారు. ముంబై వేదికగా రేపు మ్యాచ్ జరగనుంది.