కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో తప్పక చూడాల్సిన  టాప్ 10 చిత్రాలు

YouSay Short News App

తెలుగు సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడు కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిన ఎన్నో చిత్రాలను ఆయన దర్శకత్వం వహించారు. శంకరాభరణం, స్వాతిముత్యం, స్వాతికిరణం, శుభసంకల్పం, స్వయంకృషి, సిరివెన్నెల వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించారు.

ఆయన పరమపదించిన రోజు కూడా యాదృచ్ఛికంగా శంకరాభరణం రిలీజ్ రోజే కావడం గమనార్హం. దిగ్గజ దర్శకుడికి నివాళులు అర్పిస్తూ.. ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో టాప్  10 సినిమాలు ఓసారి చూద్దాం.

1.స్వాతి ముత్యం

స్వాతి ముత్యం సినిమా సున్నిత కథాంశంతో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం. కమల్ హాసన్ నటన ఓ అద్భుతం. అమాయకుడి పాత్రలో ఆయన నటన అనితర సాధ్యం. ఈ సినిమా తెలుగు నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది.

రాధిక శరత్ కుమార్, సోమయాజులు వి, మారుతి రావు గోల్లపూడి, మల్లికార్జున రావు, నిర్మలమ్మ, శరత్ కుమార్, తనికెళ్ళ భరణి  వారి పాత్రలకు జీవం పోశారు. ఈ సినిమాను  ఈదిత నాగేశ్వర రావు నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.

2.స్వర్ణకమలం

రోమాంటిక్ డ్రామగా వచ్చిన ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్. ఇప్పటికీ సంగీత ప్రియుల గొంతుల్లో ధ్వనిస్తునే ఉంటాయి. ఇందులో వెంకటేష్, భానుప్రియా చక్కగా నటించారు. బ్రహ్మానందం, ముచేర్ల ఆరుణ ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రానికి సైతం  ఇళయరాజ  మ్యూజిక్ అందించారు.

3.సాగర సంగమం

మ్యూజికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కమల్ హాసన్ నటనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. ప్రతి పాట వీనుల విందుగా ఉంటుంది. కమల్ హాసన్, జయప్రద, చక్రి తూలేటి,శరత్ బాబు, SP శైలజ నటించారు. ప్రతి పాత్ర నటనలో మరో పాత్రతో పోటీ పడేలా తెరకెక్కించారు విశ్వనాథ్.  ఈ చిత్రానికి  ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.

4. స్వయంకృషి

స్వయంకృషి సినిమా కుటుంబ కథా చిత్రం.చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విజయశాంతి, సుమలత, చరణ్ రాజ్, బ్రహ్మానందం, సోమయజులు జె వి  కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని పారహుషార్, సిగ్గుపూబంతి పాటలు క్లాసిక్.  ఈ సినిమాకు రమేష్ నాయిడు స్వరాలు అందించారు.

5. ఆపద్బాంధవుడు

ఆపద్బాంధవుడు సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్‌గా అలరించింది.ఈ చిత్రంలో గురు-శిష్యుల అనుబంధాన్ని చక్కగా వివరించారు. చిరంజీవి నటన అద్భుతం.

ఆయనతో పాటు మీనాక్షి శేషాద్రి, అల్లు రామ లింగయ్య,శరత్ బాబు, గీతా, బ్రహ్మానందం, కైకాల సత్యనారాయణ, సుత్తి వేలు, విజయ చంద్ర తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు.  ఈ చిత్రానికి MM కీరవాణి స్వరాలు సమకుర్చారు.

6.స్వాతి కిరణం

స్వాతి కిరణం సినిమా సంగీత నేఫథ్యంలో  వచ్చిన చిత్రం. ఈ సినిమాలోని ప్రతి పాటలో  మెండైన సాహిత్యం తొణికిసలాడుతుంది.  ఈ చిత్రంలో  మమ్ముటి, రాధిక శరత్ కుమార్, మాస్టార్ మంజునాథ్, సాక్షి రంగా రావు,  ధర్మవరపు సుబ్రమాణ్యం నటించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహాదేవన్ స్వరాలు సమకుర్చారు.

7.సిరివెన్నెల

శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం. ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్, చిత్రకారిణి సుహాసిని చుట్టూ తిరుగుతుంది. కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రజాదరణ పొందాయి.

ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామ శాస్త్రి రాశాడు. ఈయనకు పాటల రచయితగా ఇదే మొదటి చిత్రం. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి.. సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారారు.

8.సూత్రధారులు

సూత్రధారులు సినిమా కుటుంబకథా చిత్రం. ఈసినిమాలో పేద- ధనికవర్గాల తారతమ్యాలను, ఆత్మగౌరవాన్ని చక్కగా చూపించారు. అక్కినేని నాగేశ్వర రావు, భానుచందర్,KR విజయ, సుజాత, రమ్య కృష్ణ, మురళి మోహన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహాదేవన్ సంగీతం అందించారు.

9. శంకరాభరణం

అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాల  చిత్రగతిని మార్చిన చిత్రం శంకరాభరణం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ  కళాఖండం పండితులనే కాకుండా పామరులను సైతం ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది.

ఈ చిత్రంలోని ప్రతీ పాట ఇప్పటికీ సినీ అభిమానుల నోళ్లలో నానుతూనే ఉంటాయి.శంకరాభరణం చిత్రంలో జేవీ సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్, రాజ్యలక్ష్మీ, తులసి, నిర్మలమ్మ, సాక్షి రంగారావు, అల్లు రామలింగయ్య తదితరులు నటించారు. కేవీ మహదేవన్ మ్యూజిక్ అందించారు.జంధ్యాల మాటలు అందించారు.

10.శుభసంకల్పం

శుభసంకల్పం కుటుంబ కథా చిత్రంగా వచ్చి మంచి విజయం సాధించింది. ఇందులో కమల్ హాసన్, ఆమని, కె. విశ్వనాథ్, ప్రియ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. కీరవాణి స్వరపరిచిన పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి.