బిగ్‌బాస్‌లో ఈ వారం ఇంటిసభ్యులు అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఆట ఇంకో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇంట్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈసారి టాప్ 5 కాకుండా ఫైనల్స్‌లో టాప్ 6 ఉంటారని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారని తెలుస్తుంది. ఒకరిని వీకెండ్లో ఎలిమినేట్ చేస్తే, మరొకరిని వారం మద్యలో బయటకు పంపించేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే డేంజర్ జోన్లో ఉన్నది నటరాజ్, మిత్రా శర్మ, అనీల్. దీంతో ఈ ముగ్గురిలో ఎవరో ఇద్దరు ఈ వారం వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.