AP: నూతన విద్యా విధానంలో దేశంలోనే ఏపీ ముందుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్థి గ్లోబల్ స్టూడెంట్లాగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ని ప్రవేశ పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ‘నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందుకే ప్రత్యేక పోర్ట్ ఫోలియో ఏర్పాటు చేశాం. కంపెనీలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. మైక్రోసాఫ్ట్ ద్వారా లక్ష మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. విద్యార్థులపై మేం చేసేది పెట్టుబడి. సంక్షేమం కాదు’ అని ఆయన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.