భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతోంది. చెన్నై సహా పలు నగరాల్లో జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ స్థంభాలు నెలకొరిగి పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో తమిళనాడులోని ఆరు జిల్లాల్లో కుండ పోత వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.