విద్యుత్ కోతలపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి

© File Photo

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు విధించడాన్ని పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. వరి కోతల సమయంలో ఈ విద్యుత్ కోతలేంటని మండిపడ్డారు. చివరి తడి వరకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమాచార లోపంతోనే నిన్న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, రైతన్నలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలియజేశారు.

Exit mobile version