తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్- ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు అనుమతి లేదని అక్కడకు వెళ్లడం కుదరదని కాంగ్రెస్ నేతలకు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. జిల్లా, మండలకేంద్రాల్లో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది.