ఏపీలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు 30 మంది ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ గేర్‌ను న్యూట్రల్ చేసి వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ఘటనలో 6 మంది మృత్యువాత పడగా, 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారికి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.