ట్రాఫిక్ చలానాల చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం కల్పించిన రాయితీకి భారీ స్పందన లభిస్తుంది. రహదారి నిబంధనలు ఉల్లంఘించి ఫైన్ల భారీన పడిన వాహనదారులు తమ చలానాలను కట్టేస్తున్నారు. దీంతో 3 రోజుల్లో రూ.39 కోట్లు వసూళ్లు అయ్యాయని ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే వెబ్సైట్ సర్వర్లు డౌన్కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ రాయితీ మార్చి 31 వరకు మాత్రమే ఉంటుందని.. ఏప్రిల్ 1 నుంచి పాత పద్ధతిలోనే చెల్లింపులు చేయాలని వివరించారు.