ఈ వీడియో చూస్తే చాలు. కచ్చితంగా మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందనిపిస్తుంది. ఒక బాతు తన పిల్లలతో రోడ్డు ఎలా దాటోలో తెలియక కంగారు పడుతుంది. ఈ క్రమంలో అక్కడి ట్రాఫిక్ సిబ్బంది గమనించి నెమ్మదిగా వాటిని రోడ్డు దాటిస్తారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ను కాసేపు నిలిపివేస్తారు. బాతు పిల్లలను చూసిన వారు అయ్యే అనకుండా ఉండలేరు. ఈ సంఘటన పారిస్లో జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇన్ స్టాలో 7 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను Watch on Instagram గుర్తుపై క్లిక్ చేసి చూసేయండి మరి.