కోటి ఆశలతో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే నవ దంపతుల జీవనం తలకిందులైంది. అనుకోని ప్రమాదం వారి కలల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కర్ణాటకలోని హావేరి జిల్లాలోని కొడద గ్రామానికి చెందిన సంజయ్, ప్రీతికి నవంబర్ 28న వివాహం జరిగింది. హనీమూన్కు వెళ్లిన ఈ జంట ఆదివారం ఓ ఆలయంలో దర్శనం చేసుకుని బైక్పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే సంజయ్ ప్రాణాలు కోల్పోయాడు. భర్త విగతజీవిగా పడిఉండటాన్ని చూసి ప్రీతి కన్నీరుమున్నీరుగా విలపించింది.