రామ్ చరణ్ సతీమణి ఉపాసన తల్లిగారింట్లో విషాదం నెలకొంది. ఉపాసన నాన్నమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “ చివరి వరకు ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నాను. ఆమె నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ప్రేమను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అంటూ ఉపాసన భావోద్వేగ పోస్ట్ చేసింది. తన నాన్నమ్మ ఇచ్చిన ప్రేమానురాగాలని తన పిల్లలకు అందేలా చూస్తానని ఉపాసన రాసుకొచ్చారు.
-
Screengrab Instagram:Upasana Kamineni Konidela
-