ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనమామ మురళిరాజు మంతెన అనారోగ్యంతో మృతిచెందారు. మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో సినీ నిర్మాతగా మురళి రాజు పలు సినిమాలు నిర్మించారు. ఆయన కుమారుడు మధు మంతెన.. ‘గజిని’సహా తెలుగు తమిళ, హిందీ భాషల్లో 34కు పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. మురళి రాజు పార్ధివ దేహానికి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, దర్శకుడు క్రిష్, బన్నీ వాసు తదితరులు నివాళులు అర్పించారు.