జనరల్ టికెట్‌తో స్లీపర్ కోచ్‌లో ప్రయాణించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్లీపర్ కోచుల్లో 80శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉంటున్న రైళ్ల వివరాలను అందజేయాలని డివిజన్లను రైల్వే శాఖ ఆదేశించింది. తద్వారా వీటిని జనరల్ కోచ్‌లుగా మార్చనుంది. జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్ కోచుల్లో బెర్తులు ఖాళీగా ఉంటే వెళ్లి కూర్చోవచ్చు. ఫలితంగా ప్రయాణికులకు కాస్త సౌలభ్యం కలగనుంది. రద్దీ కూడా తగ్గుతుంది. తద్వారా ఆక్యుపెన్సీని పెంచుకోవచ్చనే ప్రణాళికలో రైల్వే శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. జనరల్ టికెట్‌తో స్లీపర్ కోచ్‌లోకి వెళ్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం