ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తన భార్య స్నేహారెడ్డితో దిగిన ఓ సెల్ఫీ ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. సోమవారం 12వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా అల్లుఅర్జున్ దంపతులు సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను అల్లుఅర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అని క్యాప్షన్ జత చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కుప్పలుతెప్పలుగా శుభాకాంక్షలు చెప్పారు. విపరీతంగా ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ పోస్టు ట్రెండింగ్‌గా మారింది.