నీట్ పీజీ 2023 ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని నిరసన జోరందుకుంది. ట్విటర్‌లో #PostponeNEETPG2023 హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. కోవిడ్ వల్ల ఇంటర్న్‌షిప్‌లో జాప్యం జరిగిందని.. గడువును పొడిగించడం వల్ల ఎక్కువమంది ఇంటర్న్‌లు పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందని వాదిస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు దిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళన కూడా చేశారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధం కావడంపై ఆలోచిస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. అయితే, కేంద్రం మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్ష ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్