RGUKT-బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల విధానం మళ్లీ మారింది. పాలిసెట్ ద్వారా కాకుండా టెన్త్ మార్కులతోనే సీట్లు భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. 2020,2021లో టెన్త్ పరీక్షలు జరగకపోవడంతో..పాలిసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించారు. దీనివల్ల 1500 సీట్లకు కేవలం 200మంది మాత్రమే ప్రభుత్వ బడుల నుంచి ఎంపికయ్యారు. దీంతో ఈ సారి ఎప్పటిలాగే టెన్త్ మార్కులతో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని అధికారులు వెల్లడించారు.