• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెస్ట్‌ఫ్రెండ్‌కు హెల్ప్ చేయ‌డంలో మ‌రోసారి ఫెయిల్ అయిన త్రివిక్ర‌మ్

    డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌, న‌టుడు సునీల్ ఇండ‌స్ట్రీకి రాక‌ముందు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్ద‌రు ఒకేసారి ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు. త్రివిక్ర‌మ్ మొద‌ట‌ చేసిన ప్ర‌తి సినిమాలో సునీల్‌కు మంచి క్యారెక్ట‌ర్స్ ఉండేవి. ఉదాహ‌ర‌ణ‌కు నువ్వే నువ్వే, నువ్వు నాకు న‌చ్చావ్, మ‌ల్లీశ్వ‌రీ వంటి సినిమాల్లో క‌డుపుబ్బా న‌వ్వించే పాత్ర‌లు సునీల్ కోసం రాశాడు. అయితే మ‌ధ్య‌లో సునీల్ హీరో అవ‌తారం ఎత్తాడు. కానీ హీరోగా కొన‌సాగలేక‌పోయాడు. తిరిగి కామెడీ పాత్ర‌లు, సినిమాల్లో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నాడు. కానీ సునీల్‌కు త్రివిక్ర‌మ్ ముందు రాసినంత పెద్ద క్యారెక్ట‌ర్స్ రాయ‌డం లేదు. అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పురంలో, ఇప్పుడు భీమ్లా నాయ‌క్ సినిమాల్లో కూడా ఆయ‌న క‌నిపించిన‌ప్ప‌టికీ పెద్ద ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు కాదు. దీంతో పాత సునీల్‌ను మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డంలో మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు త్రివిక్ర‌మ్. మ‌హేశ్ బాబుతో చేసే త‌ర్వాత సిన‌మాలోనైనా సునీల్‌కు మంచి పాత్ర ఇచ్చి మ‌ళ్లీ అప్ప‌టి సునీల్‌ను తిరిగి తీసుకొస్తారేమో చూడాలి.