యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇంగ్లిష్ యాస ఫేక్‌గా ఉందని, ఈ మధ్య ఎన్టీఆర్‌కు ఓవరాక్షన్ ఎక్కువైందని కొంతమంది ట్రోల్స్‌కు దిగుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు నటుడు గుల్షన్ దేవయ్య మద్ధతుగా నిలిచాడు. ‘‘ఎన్టీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. అతడి వ్యూహాల్లో భాగంగా అక్క డి యాక్సెంట్లో మాట్లాడి ఉండవచ్చు. ఆయనను స్వేచ్ఛగా వదిలేయండి. ఆయన గ్లోబల్ మార్కెట్ వరకు చేరితే భారతీయ సినిమాకే మంచిది. దాని నుంచి మనమందరం ప్రయోజనం పొందుతాం.’’ అంటూ ట్వీట్ చేశాడు.