చైనా యువతి కేట్ జు వెంక్వి అందంగా ఉన్నందుకు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందని కేట్, ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అయితే అవన్నీ ఫేక్ ఫోటోలను ఇంత అందమైన అమ్మాయి అంత పెద్ద చదువు చదువుతోందని అస్సలు నమ్మమంటూ అనేక మంది ఆమెను ట్రోల్ చేశారు. అవన్నీ ఫేక్ ఫోటోలు అంటూ వెక్కించారు. అయితే దీనికి ఆమె స్పందింస్తూ.. ‘ సెల్ఫీలు పోస్ట్ చేసినంత మాత్రాన వారికి చదువు రాదనే మూర్ఖపు ఆలోచన నుంచి జనం బయటికి రావాలి’ అంటూ బదులిచ్చింది. తాను పనిచేసిన సంస్థల పేర్లను కూడా వివరించింది.