చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీకి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ స్పష్టం చేశారు. జీఎస్టీ కౌన్సిల్లో చేసిన తీర్మానానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సంతకం చేసిందని ఆయన గుర్తు చేశారు. మునుగోడులో నేతన్నల ఓట్లు ఆకర్శించేందుకే ఇలా ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ‘జీఎస్టీలో 5శాతం అంటూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంత ప్రేమ ఉంటే రాష్ట్రం తన 2.5శాతం వాటాను తగ్గించుకోవచ్చు కదా? రాష్ట్రంలో టెస్కోకు ఛైర్మన్, డైరెక్టర్ లేకుండా మీ పెత్తనమేంటి’ అని ఆయన ప్రశ్నించారు.