తెలంగాణలోని ఖమ్మం జిల్లా కామంచికల్లులో టీఆర్ఎస్, సీపీఐ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. గురువారం ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి సమక్షంలో సీపీఐకు చెందిన గ్రామ సర్పంచ్ వెంకటరమణ, ఉపసర్పంచ్ ప్రభాకర్, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగింది. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు.
ఖమ్మంలో టీఆర్ఎస్, సీపీఐ బాహాబాహీ

YOUSAY