జులై 2, 3వ తేదీన సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సమావేశానికి ప్రధాని మోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. దీంతో బీజేపీ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే అధికార TRS బీజేపీ దూకుడును అడ్డుకుంటుంది. ఇప్పటికే భాజాపాకు ఫ్లెక్సీలు పెట్టేందుకు వీలు లేకుండా తెరాస హోర్డింగులన్నీ బుక్ చేసుకుంది. దీంతో పాటు ఈ సభ ముగిసిన తరువాత ప్రతి జిల్లాకు KCR వెళ్ళి సమావేశాలు నిర్వహించడం, పార్టీ ఆఫీసులు ప్రారంభించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. అటు తెరాస తీరుకు నిరసనగా బీజేపీ తమ పార్టీ ఆఫీస్ ముందు ‘సాలు దొర, సెలవు దొర’ అని ఎల్ఈడీ ఏర్పాటు చేయగా.. దానికి కౌంటర్‌గా ‘సాలు మోడీ, సంపకు మోడీ’ అంటూ తెరాస ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: