టీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ గవర్నమెంట్ భారీ షాక్ ఇచ్చింది. ఈటల మీద వచ్చిన భూ ఆరోపణలు నిజమే అని అధికారులు తేల్చారు. ఈ భూ కబ్జా ఆరోపణల వల్లే టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి హోదాలో ఉన్న ఈటలను తప్పించారు. మాసాయిపేటలో ఉన్న అసైన్డ్ భూములను ఈటలకు చెందిన జమున హేచరీస్ పేరిట కబ్జా చేశారని తేలింది. దీంతో ఈ భూముల అసలు హక్కుదారులు ఎవరో వారికి తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులు సమాయత్తం అవుతున్నారు.