హైదరాబాద్- రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టడాన్ని నిరసిస్తూ TRSVతో పాటు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థినేతలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్ తమిళిసై బిల్లును ఆమోదించకుండా బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తోందని విద్యార్థి నేతలు ఆరోపించారు.