అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులను ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడ్డారు. యుద్ధంపై జో బైడెన్ తీరు కూడా సరిగా లేదని, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం అత్యంత ఘోరమైన చర్య అని పేర్కొన్నారు. ఇటువంటి భయంకర, దురదృష్ట చర్యలు ఎప్పుడూ జరగకూడదని, యుద్ధంలో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్ ప్రజల సంక్షేమం కోసం తాము ప్రార్ధనలు చేస్తామని అన్నారు.