దిల్లీలో స్కూటీని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతి శరీరంపై 40 గాయాలు ఉన్నట్లు శవపరీక్షలో తేలింది. శరీరం కారు టైర్లలో చిక్కుకోవటంతో వెనుకభాగం ఛిధ్రమైంది. దీంతో పక్కటెముకలు బయటకు వచ్చాయని వైద్యులు వెల్లడించారు. తలభాగం దెబ్బతినటంతో పాటు వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. షాక్కు గురవ్వడం, తీవ్ర రక్తస్రావం వల్ల చనిపోయింది. ఆమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదు.