గవర్నర్ ప్రజాదర్బార్ పేరుతో రాజకీయాలు చేస్తుందని, రాజ్యంగ పరిమితులను మించి జోక్యం చేసుకుంటాన్నరని అధికార పార్టీ వర్గాలు చేస్తున్న వ్యాఖ్యలను తమిళి సై తిప్పికొట్టింది. నేను రాజ్యంగ పరిమితులోకు లోబడే పనిచేస్తున్నానని చెప్పింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారదిలా పనిచేయాలనుకుంటున్నానని వెల్లడించింది. ఇది రాజ్యాంగబద్ధమైన కార్యాలయం. రాజ్యాంగ అధికారం ద్వారా నేను చేయదగినవి మాత్రమే ఆచరిస్తున్నాను అని ఆమె స్పష్టం చేసింది. జూన్ 10న రాజ్భవన్లో గవర్నర్ మహిళా దర్బార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి 500కి పైగా దరఖాస్తులు వచ్చాయి. గవర్నర్ మహిళల సమస్యలను విని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు.