ఫుడ్ పాయిజనింగ్‌తో 43 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి నుంచి ఒక్కొక్కరుగా మొత్తం 43 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొందరు కడుపునొప్పితో, మరి కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ ఘటనపై పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.