తెలంగాణలో ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లీష్ ట్రైనింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ బడుల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మొదటి ఫేజ్లో 16000 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT), అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగుతుంది.