తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు తయారవుతోంది. మద్యంపై ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించేందుకు అబ్కారీ శాఖ రెడీ అవుతోంది. లాక్ డౌన్ సమయంలో మద్యం రేట్లను 20 శాతం మేర పెంచారు. దీంతో డిమాండ్ తగ్గింది. మరలా డిమాండ్ పెంచే దిశగా.. అబ్కారీ శాఖ అడుగులు వేస్తోంది. బాటిల్ మీద రూ. 10 వరకు తగ్గించేందుకు అబ్కారీ శాఖ చూస్తున్నట్లు తెలుస్తోంది.