హైదరాబాద్ లోని గడ్డి అన్నారం మార్కెట్ ను కూల్చివేతలను నేటి ఉదయం నుంచి GHMC ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడంతో GHMC ఈ చర్యకు పూనుకుంది. అయితే, వ్యాపారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్ లోని వ్యాపారులకు సంబంధించిన సామాగ్రిని తరలించడానికి సమయమివ్వాలని కోర్టు ఇదివరకే ఆదేశించినప్పటికీ అధికారులు కూల్చివేత పనులు మొదలుపెట్టడంతో.. మార్కెట్ వ్యాపారులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు తక్షణమే కూల్చివేతలను ఆపేయాలను ఆదేశించింది. ఈ సందర్భంగా మార్కెట్ ను కూల్చడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన కోర్టు విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది.